Tue Jul 22 2025 03:36:43 GMT+0530 (India Standard Time)
అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లి
హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకున్నారు.

హిమాచల్ ప్రదేశ్లో ఇద్దరు అన్నదమ్ములు ఒకే మహిళను పెళ్లి చేసుకున్నారు. హట్టీ తెగకు చెందిన వీరు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్నే తాము పాటించామని చెబుతున్నారు. హట్టీ తెగలో కనిపించే ఈ తరహా వివాహాన్ని జోడీదారా లేదా జజ్దా అని పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని రెవెన్యూ చట్టాల్లో ఈ తరహా వివాహానికి గుర్తింపు ఉంది. హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో ఉండే ఈ తెగకు మూడేళ్ల క్రితం షెడ్యూల్డ్ తెగగా గుర్తింపు దక్కింది. వారసుల మధ్య పంపకాల్లో వ్యవసాయ భూమి చీలికలు కాకుండా ఈ సంప్రదాయం ఉనికిలోకి వచ్చిందని, ఉమ్మడి కుటుంబాల్లో సోదరుల మధ్య ఐకమత్యం కూడా పెరుగుతుందని నమ్ముతారు. హట్టీ తెగలో వివాహాలు కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ పరిధిలోకే వస్తాయని, ఈ వివాహాలను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు గుర్తించిందని లాయర్లు చెబుతున్నారు.
Next Story