Tue Jul 22 2025 02:58:27 GMT+0530 (India Standard Time)
Parlament : నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారభం కానున్నాయి.

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారభం కానున్నాయి. మొత్తం ఇరవై ఒక్కరోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముంది. కీలక బిల్లులతో పాటు కొత్త బిల్లులను కూడా పెట్టి ఈ సమావేశాల్లో ఆమోదించే ఛాన్స్ ఉంది. ఈరోజు ప్రారంభమయిన వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 21వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.
బిల్లులను ఆమోదించడం కోసం...
ఆగస్టు 12 నుంచి 18వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలకు సెలవు ప్రకటించారు. ఈ సమావేశాల్లో ఏడు పెండింగ్ బిల్లులతో పాటు మరో ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను ఆమోదించుకునే ఉద్దేశ్యంలో ఉంది. అదే సమయంలో అనేక అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షం కూడా విపక్షాలపై ఎదురుదాడి చేసేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించుకుంది.
Next Story