Tue Jul 22 2025 03:23:55 GMT+0530 (India Standard Time)
Parliament Session : వర్షాకాలంలో హాట్ హాట్ డిస్కషన్స్.. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పేరుకు వర్షాకాల సమావేశాలు కాని హాట్ హాట్ గా కొనసాగనున్నాయి. ఈ సమావేశాలు పార్లమెంటు సమావేశాలు అధికార పార్టీకి కొంత ఇబ్బందిగా మారనున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాల వద్ద అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని అధికారపక్షం ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. అయితే గతంలో మాదిరిగా ఈ సమావేశాల్లో అధికార పార్టీ తప్పించుకుని తనకున్న బలంతో విపక్షాలపై ఎదురు దాడి చేసే అవకాశం లేదు. విపక్షం కూడా బలంగానే ఉంది. బీహార్ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను అనుకూలంగా మలుచుకోవడానికి విపక్షం సిద్ధమవుతుంది. 21 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక బిల్లులను ఆమోదించుకకునే ఉద్దేశ్యంలో అధికారపార్టీ ఉంది.
పహాల్గామ్ దాడి.. ఆపరేషన్
ముఖ్యంగా పహాల్గామ్ లో ఉగ్రవాదుల దాడి, అమాయకులైన పర్యాటకులను మట్టుబెట్టడం, తర్వాత ఆపరేషన్ సింధూర్, తర్వాత పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు, తర్వాత కాల్పుల విరమణ వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. పహాల్గామ్ లో భద్రతావైఫల్యం, ఇంటలిజెన్స్ విఫలంపై కూడా విపక్షాలు దండెత్తనున్నారు. జమ్మూకాశ్మీర్ గవర్నర్ స్వయంగా ప్రకటించడాన్ని కూడా విపక్షాలు ఆసరాగా తీసుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించనున్నాయి. తర్వాత ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ ను ఆకస్మికంగా నిలిపివేయడం, కాల్పుల విరమణ పై కూడా విపక్షాలు ప్రశ్నంచేందుకు సిద్ధమవుతున్నాయి.
అధికార పక్షం కూడా...
అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే పాక్ - భారత్ ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని ప్రకటించి అధికార పార్టీకి తలనొప్పిగా తయారయ్యాడు.ట్రంప్ ఆ మాట నుంచి వెనక్కు తగ్గడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సరైన రీతిలో ఖండించకపోవడాన్ని కూడా విపక్షం నిలదీయనుంది. మరొకవైపు బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై కూడా కేంద్రాన్ని నిలదీసే అవకాశముంది. అయితే విపక్షాలను కట్టడి చేసే వ్యూహం తమ వద్ద ఉందని అధికారపక్షం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ వంటి నేతలు సమావేశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. విపక్షాలను ఎలా ఎదుర్కొనాలన్న దానిపై తమకంటూ ఒకప్రత్యేక స్ట్రాటజీ ఉందని చెబుతుననారు. మొత్తం మీద నేటి నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు వేడివేడిగా సాగనున్నాయి.
Next Story