Wed Dec 10 2025 09:39:34 GMT+0530 (India Standard Time)
నేడు లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ
ఏడోరోజు పార్లమెంట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

ఏడోరోజు పార్లమెంట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. నేడు ఎన్నికల సంస్కరణలపై లోక్ సభలో చర్చ జరగనుంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం చేస్తున్న పనులపై ఇప్పటికే రాహుల్ గాంధీ అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో నేడు సభలో ఏ రకంగా మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
రాహుల్ తొలిగా...
బీహార్ లోనూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గతంలో ఆరోపించారు. ఎస్ఐఆర్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో నేడు స్పీకర్ చర్చకు అనుమతించారు. ప్రభుత్వం కూడా దీనిపై సమాధానం చెప్పేందుకు సిద్ధమయింది. అందుకోసం ముందుగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏకు చెందిన ఎంపీలుతో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Next Story

