Tue May 06 2025 19:45:39 GMT+0530 (India Standard Time)
A k Stalin : స్టాలిన్ కీలక కామెంట్స్... ఇక పేర్లు కూడా?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. రోజువారీ జీవితంలో, ప్రత్యేకించి పిల్లలకు పేర్లు పెట్టడంలో, వ్యాపార సంస్థలకు నామకరణం చేయడంలో తమిళ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని స్టాలిన్ కోరారు. తమిళ భాషా సంస్కృతులను స్పృహతో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన అన్నారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను వివాహ వేడుకలకు హాజరైనప్పుడు కాబోయే దంపతులకు తమ బిడ్డకు చక్కటి తమిళ పేరు పెట్టుకోవాలని సూచిస్తుంటానని ముఖ్యమంత్రి తెలిపారు.
వ్యాపారులు కూడా...
మనం తమిళనాడులో నివసించే తమిళులమని, అయినప్పటికీ, చాలాసార్లు మన పిల్లలకు ఉత్తర భారత పేర్లను లేదా ఆంగ్ల పేర్లను ఎంచుకుంటున్నామని, . దీనిని నివారించి, మన పిల్లలకు స్వచ్ఛమైన తమిళ పేర్లనే పెట్టాలని ీను ప్రజలను కోరుతున్నానని స్టాలిన్ అన్నారు. వ్యాపారులు కూడా విస్తరిస్తూ తమ దుకాణాలకు, వ్యాపారాలకు ఇంగ్లీష్ పేర్లు పెట్టకుండా వాటి స్థానంలో తమిళ పేర్లను పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకమైన తమిళ పదాలు దుకాణం గుర్తింపుగా మారాలని, ఒకవేళ పేరు ఆంగ్లంలోనే ఉంచాల్సి వస్తే కనీసం దానిని తమిళ భాషలో రాయాలని స్టాలిన్ సూచించారు.
Next Story