Tue May 06 2025 18:37:45 GMT+0530 (India Standard Time)
IPL 2025 : నేడు ఢిల్లీ vs హైదరాబాద్
ఈరోజు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో తలపడుతుంది

ఐపీఎల్ లో మ్యాచ్ లన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. ప్లేఆఫ్ రేసుకు చేరుకునే దశలో ఉన్నాయి. ఇప్పటికే యాభై నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. మంచి పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తొలినాళ్లలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపించిన ఢిల్లీ కాపిటల్స్ వెనకబడినప్పటికీ ఇంకా ప్లే ఆఫ్ రేసులోనే ఉంది. మరొక వైపు కోల్ కత్తా నైట్ రైడర్స్ నిన్న జరిగిన మ్యాచ్ లో గెలవడంతో కొంత ప్లేఆఫ్ రేసుల ఆశలను మెరుగుపర్చుకుంది. మిగిలిన జట్లు మాత్రం ప్లేఆఫ్ కు వచ్చే అవకాశం లేదు.
నేడు కీలక మ్యాచ్...
ఈరోజు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో తలపడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడయంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇప్పటి వరకూ పది మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి నాలుగింటిలో ఓటమి పాలయి ప్లేఆఫ్ రేసులో ఇంకా వచ్చేందుకు అవకాశాలను కల్పించుకుంది. అందుకే ఈ మ్యాచ్ ఢిల్లీకి కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే పథ్నాలుగు పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకుపోతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఈ సీజన్ లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. పది మ్యాచ్ లు ఆడి మూడింటిలో గెలిచి ఏడింటిలోఓటమి పాలయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరిది గెలుపు అన్నది చూడాలి.
Next Story