Tue May 06 2025 19:06:46 GMT+0530 (India Standard Time)
IPL 2025 : ఢిల్లీ కాపిటల్స్ కు ఏదో అడ్డు వచ్చినట్లుంది.. ఇలా వరస వైఫల్యాలేంటి?
ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఒక ఊపు ఊపింది. ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు వస్తుందని భావించారు

ఢిల్లీ కాపిటల్స్ జట్టు మాత్రం ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఒక ఊపు ఊపింది. ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు వస్తుందని భావించారు. ప్లే ఆఫ్ కూడా కాదు. ఫైనల్స్ లో కూడా చోటు సంపాదిస్తుందన్న అంచనాలు ఆజట్టుపైన ఉన్నాయి. మంచి బౌలర్లు, నిలకడగా ఆడే బ్యాటర్లు ఆ జట్టుకు బలం కావడంతో ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై అంచనాలు మొదటి నుంచి బాగానే ఉన్నాయి. ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు సమయం దగ్గర పడే కొద్దీ డీలా పడింది. పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపడం లేదు. అంతేకాదు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద ఓడిపోవాల్సిన జట్టు వర్షం అనుకూలంగా మార్చి ఇంకా ప్లే ఆఫ్ రేసును నిలబెట్టిందని చెప్పాలి.
బలమైన జట్టుగా...
ఢిల్లీ కాపిటల్స్ జట్టు లో కరుణ్ నాయర్, పోరెల్, డుప్లెసిస్, కేఎ్ల రాహల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్, ఇషాన్ మలింగ వంటి బలమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక బౌలర్లకు కూడా తిరుగు లేదు. మంచి బౌలర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు వికెట్ తీస్తూ ప్రత్యర్థి జట్టును మట్టికరిపించేవ వారున్నారు. బ్యాటర్లు ఎంత బలమైన వారో బౌలర్లు కూడా అంతే రాటుదేలిన వారు. కానీ నిన్న జరిగిన మ్యాచ్ చూసిన తర్వాత ఢిల్లీ కాపిటల్స్ జట్టు కు ఏమైందన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆరంభంలో ఉన్న దూకుడు ఏమయిందన్న సందేహం ఎవరికైనా కలుగుతుతంది.
అభిమానుల్లో ఆందోళన...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి బంతికి తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ కాపిటల్స్ కరుణ్ నాయర్ డకౌట్ అయ్యాడు. డుప్లెసిస్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. పోరెల్ ఎనిమిది పరుగులు చేసి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కూడా పది పరుగులుకే అవుటయ్యాడు. అక్షర్ పటేల్ ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. ఇలా ఓపెనర్లు అందరూ వరస పెట్టి అవుట్ అవుతుండటం ఢిల్లీ కాపిటల్స్ జట్టు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. తొలినాళ్లలో అన్ని ముఖ్యమైన ఓడించిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇప్పటి వరకూ పదకొండు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. ఆరు మ్యాచ్ లలో ఓడింది. ఆ ఐదు మ్యాచ్ లు కూడా తొలి దశలో గెలిచినవే. నిన్న ఒక్క పాయింట్ రావడంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్ రేసులో ఏ విధంగా ముందుకు పోతుందన్నది మాత్రం అనుమానమే.
Next Story