Sun Jul 27 2025 00:58:41 GMT+0530 (India Standard Time)
India Vs England : బ్యాటర్లదే పై చేయి.. ఇంగ్లండ్ ను తట్టుకోవడం కష్టమేనా?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు

ఇండియా - ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఎంత శ్రమించినా వికెట్ ను దొరకబుచ్చుకోలేకపోతున్నారు. ఎలా ఆడాలో ఇంగ్లండ్ బ్యాటర్లు మాంచెస్టర్ మైదానంలో చూపిస్తుంటే.. ఎలా ఆడకూడదో భారత ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మొన్నటి నుంచి రెండు వికెట్లు తీసిన తర్వాత మూడో వికెట్ తీయడానికి భారత్ బౌలర్లు విపరీతంగా శ్రమించినా ఫలితం లేదు. అంటే ఇది భారత బౌలర్ల వైఫల్యమా? లేక ఇంగ్లండ్ బ్యాటర్ల మెరుగైన ప్రదర్శనా? అన్నది మాత్రం ఈరోజు తేలనుంది.
తక్కువ పరుగుల లక్ష్యంతో...
ఎందుకంటే భారత బ్యాటర్లు 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తక్కువ పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఎవరూ సెంచరీ చేయకపోయినా ఒకరిద్దరూ అర్థ సెంచరీలు సాధించినప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు వికెట్ల మధ్య ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక సమర్పించుకున్నారు. దీంతో భారత్ 358 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ రెండు వికెట్ల తర్వాత వికెట్ అందిపుచ్చుకోకపోవడంతో ఇంగ్లండ్ భారీ పరుగులను చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు అందరూ అర్థసెంచరీలు దాటి అరవై నుంచి డెబ్భయి పరుగులు చేసి భారత్ విధించిన లక్ష్యాన్ని చాలా సులువుగా జట్టు చేరుకునేలా చేశారు.
డ్రా గా ముగించడమే...
ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 150 పరుగులు చేశాడు. బెన్ స్టోక్ 77 పరుగులతో బ్యాటింగ్ లో ఉన్నాడు. ఓలీ పోప్ 71 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసింది. అంటే భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. బుమ్రా బంతి కూడా తిరగ లేదు. వాషింగ్టన్ సుందర్ లంచ్ బ్రేక్ తర్వాత వేగంగా రెండు వికెట్లు దొరకబుచ్చుకున్నా రూట్ మాత్రం ఆ అవకాశం ఇవ్వకుండా అత్యధిక రన్స్ చేయడంతో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచే అవకాశముంది. అయితే ఈ మ్యాచ్ లో గెలుపు కన్నా, డ్రా వైపు భారత్ మొగ్గు చూపడం మంచిదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బుమ్రా ఒకటి, కాంబోజ్ ఒకటి, సిరాస్ ఒకటి, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు.
Next Story