Tue May 06 2025 19:10:52 GMT+0530 (India Standard Time)
PL 2025 : బంతి బంతికి టెన్షన్.. చివర బంతికి గెలుపు మాత్రం కోల్ కత్తానైట్ రైడర్స్ దే
కోల్ కత్తా లో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పై ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ సీజన్ 18 లో యాభై నాలుగు మ్యాచ్ ల పూర్తయ్యాయి. మరో ఇరవై మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. అందుకే ఇప్పుడు ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. బాల్ బాల్ కు టెన్షన్ పెరుగుతుంది. సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు మోత మోగిస్తున్నారు. విజయం కోసం చివరి బంతి వరకూ ప్రయత్నిస్తున్నారు. చివరి బంతి విజయాన్ని డిసైడ్ చేసే మ్యాచ్ లు ఎన్నో జరిగాయి. అందులో కోల్ కాత్తా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా రంజుగా జరిగింది. చివరి బంతి వరకూ విజయం ఎవరదిన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు రాజస్థాన్ రాయల్స్ కు విజయం మొహం చాటేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు విజయం వరించింది. నిన్న కోల్ కత్తా లో జరిగిన మ్యాచ్ లో చివరి బంతి వరకూ సాగిన పోరులో కోల్ కత్తా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ పై ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది.
భారీ లక్ష్యం విధించినా...
తొలుత టాస్ గెలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ భారీ పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది. ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్ కత్తానైట్ రైడర్స్ 206 పరుగులు చేసింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ లో ఆండ్రీ రస్సెల్ యాభై పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించాడు. సొంత మైదానం కావడంతో కొంత ఈ జట్టుకు అనుకూలంగా మారింది. రఘువంశీ నలభై నాలుగు పరుగులు చేసి అవుటయ్యాడు. రెహ్మాన్ గుర్బాజ్ 35పరుగులు చేశాడు. అజింక్యా రహానే ముప్ఫయి పరుగులు చేసి ముగించాడు. చివర్లో రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆరు బాల్స్ లో పందొమ్మిది పరుగులు చేశాడు. దీంతో కోల్ కత్తా నైట్ రైడర్స్ 206 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచగలిగింది.
గెలుపు ముంగిట నిలిచి..ఓటమి పాలయి...
అయితే రాజస్థాన్ రాయల్స్ కూడా మంచి ఆరంభంతోనే దిగింది. యశస్వి జైశ్వాల్ 34 పరుగులు చేసి అవుటయ్యాడు. హెట్ మేయర్ 29 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని మోత పుట్టించాడు. అయితే తృటిలో రియాన్ పరాగ్ సెంచరీ మిస్ అయ్యాడు. 94 పరుగులు చేసి అవుటయ్యాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే దాదాపు 25 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో శుభమ్ దూబె ఉన్నాడు. ఒక ఓవర్ కు పదమూడు పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్ బాదాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ముంగిటకు వచ్చి అలా ఆగింది. అయితే చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సి ఉండగా ఒక పరుగు చేసి రెండో పరుగుకోసం ప్రయత్నించిన శివమ్ దూబె అవుట్ కావడంతో కేవలం ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలయింది. బ్యాడలక్ రాయల్స్..కష్టపడినా చివరకు అదృష్టం మొహం చాటేసింది.
Next Story