Tue May 06 2025 18:49:27 GMT+0530 (India Standard Time)
IPL 2025 : హైదరాబాద్ కు వర్షం కూడా కలసి రాలేదు.. ఢిల్లీకి అదే అచ్చొచ్చిందిగా
హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ సీజన్ కలసి రాలేదన్నది మరోసారి రుజువైంది. ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ లోనూ వరుణుడు పగ పట్టాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్స్ కు చేరుకుని ఛాంపియన్ షిష్ ను తృటిలో చేజార్చుకుంది. నాడు చేసిన తప్పుకు ఈ ఏడాది ఫలితం అనుభవించాల్సి వస్తుంది. తొలి నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమిలతోనే ఎక్కువగా ప్రయాణం చేసింది. గత సీజన్ లో ఐపీఎల్ సీజన్ లోనే అత్యధికంగా పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి మాత్రం తేలిపోతుంది. కనీసం ఈ మ్యాచ్ లో గెలిచి అయినా ప్లే ఆఫ్ రేసు ఆశలు నిలుపుకుంటుందని అనుకుటే వరుణుడి దెబ్బకు ప్లేఆఫ్ రేస్ కు దూరమయింది.
తక్కువ పరుగులు చేసి...
హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి బంతికి తొలి వికెట్ అందుకుంది.ఢిల్లీ కాపిటల్స్ జట్టులో కరుణ్ నాయర్ డకౌట్ అయి వెనుదిరిగాడు. స్కోరు కూడా 1/1 తో ప్రారంభించింది. తర్వాత డుప్లెసిస్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. పోరెల్ ఎనిమిది పరుగులు చేసి వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కూడా పది పరుగులుకే అవుటయ్యాడు. అక్షర్ పటేల్ ఆరు పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత స్టబ్స్ 41 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. విప్రాా్ పద్దెనిమిది పరుగుల చేసి రనౌట్ అయి వెనుదిగాడు. అశుతోష్ 41 పరుగులు చేయడంతో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది.
లక్ష్యం చిన్నది కావడంతో...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్ష్యం చిన్నది కావడంతో ఇక విజయం ఖాయమని అనుకున్నారంతా. కావ్యమారన్ కూడా స్టేడియంలో చిందులేశారు. అయితే వర్షం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. రాత్రి 9.22 గంటలకు మొదలయిన వర్షం పది గంటల వరకూ ఏకధాటిగా పడింది. దీంతో ఉప్పల్ స్టేడియం తడిసి ముద్దయింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత చివరకు అంపైర్లు మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ కాపిటల్స్ మాత్రం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఢిల్లీ కాపిటల్స్ పదమూడు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ రేసులో ఇంకా దూసుకుపోతుంది.
Next Story