Tue May 06 2025 19:49:11 GMT+0530 (India Standard Time)
IPL 2025 : ఐపీఎల్ లో నేడు డబుల్ థమాకా
కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొంటుంది

ఐపీఎల్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు ఇప్పటికే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేరుకున్నట్లే. తర్వాత ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ లు ఉన్నాయి. ఢిల్లీ కాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా రేసులో ఉన్నాయి. అయితే నాలుగు స్థానాలు చేరేవి ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినప్పటికీ మరో రెండు రోజులు గడిస్తేనే తప్పించి ఏ జట్లు ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంటాయన్నది తెలియదు. ఇకపై మ్యాచ్ లన్నీ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి.
నేడు రెండు మ్యాచ్ లు...
ఈరోజు మరో రెండు కీలక మ్యాచ్ లు ఐపీఎల్ లో జరగనున్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. కోల్ కత్తా వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు మ్యాచ్ జరగుంది. పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొంటుంది. ధర్మశాలలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే కోల్ కత్తా నైట్ రైడర్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో కోల్ కత్తా విజయం సాధిస్తేనే కొంత వరకూ ఫలితం ఉంటుంది. రాజస్థాన్ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్లే. ఇక పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ మాత్రం నువ్వా నేనా అన్నట్లు కొనసాగనుంది. పంజాబ్ మంచి ఫామ్ లో ఉండగా, లక్నో పడి లేస్తూ వస్తుంది. ఈ మ్యాచ్ లో విజయం రెండు జట్లకూ అవసరమే.
Next Story