Tue May 06 2025 08:29:20 GMT+0530 (India Standard Time)
కళ్లు చెదిరే ఆస్తులు... విల్లాలు.. ఇండిపెండెంట్ హౌస్ లు... భూములు అక్రమాస్తులు రెండు వందల కోట్లకుపైగాగానే?
కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హారిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు ముగిశాయి

కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హారిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయనను కోర్టులో హాజరు పర్చగా పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. నిన్న ఉదయం నుంచి కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హరిరామ్ పెద్దయెత్తున ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించిన ఏసీబీ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లో కీలకంగా వ్యవహరించిన ఈ మాజీ ఈఎన్సీ ఇళ్లపై సోదాలు నిర్వహించినప్పుడు కళ్లు చెదిరిపోయే ఆస్తులు, బంగారం లభించినట్లు తెలిసింది.
కీలక పత్రాలు స్వాధీనం...
ఈ తనిఖీల నుంచి అనేక కీలక మైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఈ ఆస్తుల విలువ రెండు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. నిన్న తెల్లవారు జాము నుంచి పథ్నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు జరపగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయని ఏసీబీ అధికారులు తెిపారు. హరిరామ్ భార్య కూడా ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తుండటంతో ఆమె ఇళ్లలోనూ తనిఖీలను నిర్వహించారు. అనేక చోట్ల విల్లాలతో పాటు విలాసవంతమైన భవనాలు, అపార్ట్ మెంట్లు, వ్యవసాయ భూములతో పాటు నగదుతో పాటు జ్యుయలరీ కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెల్లడయింది.
ఇవీ ఆస్తులు...
హరిరామ్ ఇళ్లలో ఏసీబీ జరిపిన తనిఖీల్లో ఆయనకు శామీర్ పేట్ లో ఒక విల్లాతో పాటు, కొండాపూర్ లో విల్లా, శ్రీనగర్ కాలనీ లో ఒక ఫ్లాట్ తో పాటు మాదాపూర్ లోనూ మరొక ప్లాట్ ఉందని తేల్చారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ కమర్షియల్ స్సేస్ ను హరిరామ్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. మర్కూక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, పటాన్ చెర్వులో ఇరవై కుంటల భూమి, హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్లు ఇళ్లు, బొమ్మల రామారంలో ఒక ఫామ్ హౌస్, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ఫ్లాట్, మిర్యాలగూడలో ఒక ఫ్లాట్, మామిడితోట, రెండు బీఎండబ్ల్యూ కార్లు, బంగారు ఆభరణాలు, నగదు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా హరిరామ్ లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉంది.
Next Story