Tue May 06 2025 15:41:38 GMT+0530 (India Standard Time)
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లు వారికే.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇప్పటికే కొందరు లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్లనునిర్మించుకున్నారు. బేస్ ప మెంట్ పూర్తి చేసుకున్న వారికి లక్ష రూపాయల నగదును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామసభల ద్వారాదాదాపు 78 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందుల ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఉన్న వారు కేవలం 36 లక్షలు మాత్రమే. మిగిలిన నలభై రెండు లక్షల మంది దరఖాస్తుదారులు అనర్హులని అధికారులు గుర్తించారు. వారికి ఉన్న అర్హతలను పరిశీలించిన మీదట కేవలం 36లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు.
అనర్హులుగా గుర్తించిన వారు..
అనర్హులుగా గుర్తించిన వారంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారేనని అధికారుల చెబుతున్నారు. తొలి విడతగా ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా ఉన్న వారికే కేటాయిస్తామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. అయితే సొంత స్థలం ఉన్నవారికి తొలి జాబితాలో చోటు కల్పించారు. తర్వాత జాబితాలో స్థలాలను కొనుగోలు చేసి వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది కేవలం 4.50 లక్షల ఇళ్లు మాత్రమే మంజూరు కానుంది. వీటిని పూర్టి చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసి వారికి పట్టాలతో పాటు ఇంటికి సంబంధించిన నగదును కూడా చెల్లించనుంది.
ఎంపిక ఇలా...
లబ్దిదారులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 గా విభజించి వారికి ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు, కార్లు ఉన్నవారికి, ప్రభుత్వఉద్యోగులకు ఎల్ 3 జాబితాలో చేర్చారు. అయితే ఎల్ 3 జాబితాలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే నిబంధనలు అందుకు అంగీకరించవు కాబట్టి ఎల్ 1, ఎల్ 2 వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో వడపోత తర్వాత చాలా దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఈ ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది.
Next Story