Mon Feb 02 2026 13:37:20 GMT+0530 (India Standard Time)
Weather Report : చలి తగ్గిందనుకుంటుంటే.. మళ్లీ పెరుగుతుందిగా
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఉష్ణోగ్రతలు గతం కంటే కొంత పెరిగినప్పటికీ చలి పూర్తిగా కనుమరుగు కాలేదు. శివరాత్రి వరకూ ఇదే పరిస్థితి ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. సాయంత్రం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. అలాగే తెల్లవారు జామున మాత్రం కొంత చలి వాతావరణం కనిపిస్తుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చలి పూర్తిగా ...
ఆంధ్రప్రదేశ్ లో చలి పూర్తిగా కనుమరుగయింది. ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అనేక ప్రాంతాల్లో ముప్ఫయి నుంచి ముప్ఫయి రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పొగమంచు అక్కడక్కడా అలుముకుంటుందని, ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం కొంత చలి వాతావరణం నెలకొంది. దీంతో పాటు తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయని, రాయలసీమలోనూ కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పారు.
తెలంగాణలో పెరుగుతున్న...
తెలంగాణలో చలితీవత్ర చాలా వరకూ తగ్గింది. జనవరి నెల వరకూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ నేడు మాత్రం డబుల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా హైదరాబాద్ లో కూడా భానుడి భగభగలు కనిపిస్తున్నాయి. అయితే తెల్లవారు జామున, రాత్రి వేళ మాత్రమే కొంత చలి వాతావరణం కనపడుతుందని, పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story

