Tue May 06 2025 12:16:38 GMT+0530 (India Standard Time)
Revanth Reddy :నేడు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల పరిస్థితిపై సమీక్షించనున్నారు. ప్రధానంగా నీటిపారుదల శాఖలో ఉద్యోగ నియామకపత్రాలను పంపిణీ పై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఎన్.డి.ఎస్.ఏ రిపోర్ట్ పై కూడా సమీక్ష చేస్తారు.
ఎయిర్ పోర్టుల నిర్మాణంపై...
అలాగే తెలంగాణలో నిర్మించ తలపెట్టిన వివిధ ఎయిర్ పోర్టుల నిర్మాణాలపై కూడా రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులతో పాటు ఆలస్యం కావడానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సత్వరం విమానాశ్రయాల నిర్మాణాలకు అనుమతులు సాధించేలా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story