Fri Apr 03 2026 18:10:05 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రైతుభరోసా నిధులను విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల రెండో వారంలో రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన 2,650 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఆదేశించారు.
మూడు విడతల్లో...
మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా నిధులను జమ చేయనుంది. ఇప్పటికే తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం రెండో విడత నిధులను కూడా జమ చేసేందుకు సిద్ధమయింది. ఐదు ఎకరాలన్న రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి.
Next Story

