Sat Mar 21 2026 16:08:18 GMT+0530 (India Standard Time)
Telangana : వాహనదారులకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రెండో వాహనానికి పన్ను ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ ఒకే పేరు మీద రెండో వాహనం కొనుగోలు చేస్తే రెండు శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం వసూలు చేసేది. అయితే దానిని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రెండో వాహనం ఉంటే...
ఈ నెల 23వ తేదీ నుంచి ఈ పన్ను రద్దు అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఒకే పేరు మీద రెండు వాహనాలను కొనుగోలు చేయడానికి మార్గం సుగమమయింది. ఈ నెల 23వ తేదీ నుంచి వాహన పోర్టల్ ను కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఈ పన్నురద్దు అమలులోకి రానుంది.
Next Story

