Tue May 06 2025 13:30:30 GMT+0530 (India Standard Time)
గ్రూప్ వన్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు స్టే
గ్రూప్ వన్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సంచలన తీర్పు చెప్పింది

గ్రూప్ వన్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సంచలన తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ నియామకాలపై స్టే కొనసాగుతుందని తెలిపింది. గ్రూప్ 1 పిటీషన్ పై విచారణ జూన్ 11వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకూ స్టే కొనసాగుతుందని హైకోర్టు చెప్పడంతో గ్రూప్ వన్ నియామకాలు మరో రెండు నెలల పాటు నిలిచిపోయినట్లేనని అంటున్నారు.
జూన్ 11వ తేదీ వరకూ...
గ్రూప్ 1 పిటీషన్ పై విచారణను జూన్ 11వ తేదీన చేపట్టి తర్వాత తీర్పు చెప్పనుంది. అప్పటి వరకూ స్టే కొనసాగనుండటంతో నియామకాలు నిలిచిపోయాయి. గ్రూప్ వన్ నియామకాలపై స్టే ను ఎత్తివేయాలని టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీషన్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటీషన్ వేయడంతో హైకోర్టులో తిరిగి స్టేను కొనసాగించాలని నిర్ణయించింది. మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులో నిబంధనలు అనుసరించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో డివిజనల్ బెంచ్ స్టే విధించింది.
Next Story