తెలంగాణ వెదర్ మ్యాన్.. ఈ అకౌంట్ వెనుక ఉంది ఎవరో తెలుసా?
వర్షాకాలం వచ్చేసింది. అయితే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పడదో క్లారిటీగా అందరికీ తెలియదు.

వర్షాకాలం వచ్చేసింది. అయితే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పడదో క్లారిటీగా అందరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లలో తెలంగాణ వెదర్‌మ్యాన్ ఒకరు. ఇతడేమీ వాతావరణ శాఖ నిపుణుడు కాదు. హైదరాబాద్‌కు చెందిన బాలాజీ తరణి అనే ఓ కుర్రాడు. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా వాతావరణ పరిశోధనపై ఉన్న ఆసక్తితో బాలాజీ ఈ పని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కూడా బాలాజీ ఇచ్చే వెదర్ అప్డేట్స్ ను ఫాలో అవుతూ ఉంటారు.
2020 అక్టోబరులో ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ పేరిట ఎక్స్‌లో ఖాతాను ప్రారంభించాడు బాలాజీ. వాతావరణ శాఖ కంటే మెరుగ్గా వాతావరణ అంచనాలు ఇస్తున్నావని పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. సొంతంగా మెషీన్ లెర్నింగ్ ద్వారా సృష్టించుకున్న అల్గారిథమ్‌తో వాతావరణ అంచనాలు వేస్తున్నాడు బాలాజీ.