Fri Mar 20 2026 03:29:34 GMT+0530 (India Standard Time)
వైసీపీ కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
విశాఖలో వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది

విశాఖలో వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి పార్టీలోని కాపు సామాజికవర్గం నేతలందరూ హాజరయ్యారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంట్లో జరిగిన ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. సమావేశానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాధ్ తో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వివిధ అంశాలపై...
అంబటి రాంబాబు అరెస్ట్, ఇటీవల పరిణామాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కాపు సామాజికవర్గానికి జరుగుతున్న అన్యాయాలపై పోరాడాలని నిర్ణయించారు. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించకపోవడంతో పాటు పలు పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై కాపు వైసీపీ సామాజికవర్గం నేతలు చర్చించారు.
Next Story

