Chandrababu : పదమూడు లక్షల కోట్లు.. ఇరవై లక్షల ఉద్యోగాలు
సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు

సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. రెండో రోజు సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ మొత్తం 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ముందుగా ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కాకినాడ లేదంటే మూలపేటల్లో ఎల్జీ కెమ్ నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని సీఎం ఈ సందర్భంగా ప్రతిపాదించారు. జేఎస్డబ్ల్యుతో కలిసి ఎల్జీ కెమ్ ఏర్పాటు చేయదలిచిన కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్‌కు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుందని సీఎం సూచించారు. డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్... ఇలా అన్ని రంగాల్లో ఏపీ ముందుకెళ్తోందని వివరించినచంద్రబాబు అబుదాబి తరహాలో రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగస్వామి కావాలని యున్జోకోను కోరారు.

