Fri Mar 20 2026 03:31:00 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
నేడు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది

నేడు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పాల్గొననున్నారు. యుద్ధ నౌకలపై సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 71 స్వదేశీ, విదేశీ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా...
అయితే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లో ఫ్లైట్ క్వారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొననుండటంతో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
Next Story

