Fri Mar 20 2026 03:30:48 GMT+0530 (India Standard Time)
నేడు రేపు విశాఖలో మంత్రి నారాయణ
నేడు ,రేపు విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు

నేడు ,రేపు విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ చేరుకోనున్న మంత్రి నారాయణ మధ్యాహ్నం 3.30 నుంచి నగరంలో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లు,వెలంపేట మురికివాడను పరిశీలించనున్నారు.సాయంత్రం 5.30 కు హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ట కు మంత్రి నారాయణ స్వాగతం పలకనున్నారు.
హడ్కో సమావేశంలో...
రేపు ఉదయం 9.30కి నోవాటెల్ హోటల్ లో జరిగే హడ్కో యువిన్ మొదటి ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా మంత్రి నారాయణ హాజరుకానున్నారు. సమావేశానికి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి శ్రీనివాస్, ఐదు రాష్ట్రాలు,పుదుచ్చేరి అధికారులు హాజరు కానున్నారు.
Next Story

