Fri Mar 20 2026 03:29:34 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : పవన్ ఉత్తరాంధ్ర పర్యటన నేటి నుంచి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం పవన్‌కల్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరుకునే అవకాశముంది.
రేపు అరకు జిల్లాలో...
రేపు పవన్ కల్యాణ్ అరకు జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజనులతో సమావేశమవుతారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రివర్గ సమావేశం నేడు పూర్తయిన తర్వాత విశాఖకు పవన్ బయలుదేరి వెళతారు.
Next Story

