Tue May 06 2025 09:25:00 GMT+0530 (India Standard Time)
Simhachalam : సింహాచలం ప్రమాదంలో సాఫ్ట్ వేర్ దంపతుల మృతి
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం లో జరిగిన ప్రమాదంలో సాఫ్ఠ్ వేర్ దంపతులు మరణించారు

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం లో జరిగిన ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గోడ కూలడంతోనే ఎనిమిది మంది మరణించారు. విశాఖలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచి వేసింది. అయితే ఈ ఘటనలో దంపతులు మరణించారు. వీరిది విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ లు ఈ ప్రమాదంలో మరణించారు.
దర్శించుకుందామని వచ్చి...
పిళ్లా ఉమామహేశ్వరరావు వయసు ముప్ఫయి ఏళ్లు కాగా, శైలజ వయసు ఇరవై ఆరేళ్లు. హైదరాబాద్ లో ఇద్దరూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ వర్క్ ఫ్రం హోం కింద విశాఖలోనే ఉంటున్నారు. వీరిద్దరూ అప్పన్న దర్శనానికి మూడు వందల రూపాయల క్యూ లైన్ లో నిలబడి ఉండగా గోడకూలడంతో మరణించారని చెబుతున్నారు. ఉమామహేశ్వరరావు హెచ్.సి.ఎల్. లోనూ, శైలజ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి మూడేళ్ల క్రితమే వివాహం అయింది
Next Story